Tina Datta: పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానంటున్న నటి
కలర్స్ టీవీలో వచ్చే ఉత్తరన్(Utharan) సీరియల్ తో బాగా పాపులర్ అయిన నటి టీనా దత్త(Tina Datta). బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత ఎన్నో సీరియల్స్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది టీనా. ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్న టీనా, ఫ్యూచర్ లో కూడా తనకు ఎవరితో మింగిల్ అయ్యే ఆలోచన లేదని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
సింగిల్ గానే తల్లి అవడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, తల్లి కావడానికే పెళ్లి చేసుకునే పన్లేదని టీనా అంటోంది. ఫ్యూచర్ లో దత్తత లేదా సరోగసీ ద్వారా పిల్లలకు తల్లి కావాలని చూస్తున్న టీనా, తాను మంచి తల్లిని కాగలనని నమ్ముతున్నట్టు, సరైన టైమ్ వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రూవ్ చేసుకుంటానని తెలిపింది.
తాను సుస్మితా సేన్(Susmitha Sen)కు పెద్ద ఫ్యాన్ ని అని, ఆమె ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకోవడం చూసే తాను కూడా ఆ దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు టీనా దత్త తెలిపింది. అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తన తల్లిదండ్రుల మద్దతు ఉంటుందని, భర్త అవసరం లేకుండానే పిల్లల్ని పెంచుతానని ఆమె చెప్పుకొచ్చింది.













