టిల్లూకి రిలీజ్ డేట్ సమస్య
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నందుకు ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ ఇస్తామని చెప్పడంతో ముందే ఆ డేట్ కు షెడ్యూల్ అయిన టిల్లూ స్క్వేర్ సినిమాకు మరో కొత్త చిక్కొచ్చి పడింది. కొత్త రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ ఎంతో సతమతమవుతున్నట్లు టాక్. టిల్లూ స్వ్కేర్ షూటింగ్ ఇంకా పూర్తవలేదు.
ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి బ్యాలెన్స్ షూటింగ్ ను ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నాడు డైరెక్టర్ మల్లిక్ రామ్. సినిమాకు ఇప్పటికే పలు రీషూట్లు కూడా జరిగాయని సమాచారం. ఫిబ్రవరి లోపు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవడం దాదాపు అసాధ్యమే. కాబట్టి మార్చి నెలాఖరుకు సినిమా పూర్తైతే అప్పుడు రిలీజ్ చేయడానికి మరో వారం గ్యాప్ లో దేవర సినిమా రిలీజ్ అవుతుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండటం వల్ల దేవరపై భారీ అంచనాలున్నాయి. కాబట్టి అంత పెద్ద సినిమాకు ముందు ఈ సినిమాను రిలీజ్ చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు మేకర్స్. యూత్ లో టిల్లూ స్క్వేర్ కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సోలో రిలీజ్ దక్కితేనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆ దిశ గా సితార పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.













