టిల్లూ స్క్వేర్.. భలే డేటు పట్టారే!
డీజే టిల్లూ తో మంచి హిట్ అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లూ స్క్వేర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల నుంచి ఎన్నో రకాల వార్తలొస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాది లేదని క్లారిటీ వచ్చేసింది. టిల్లూ స్క్వేర్ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ను నిర్మాత నాగవంశీ చాలా తెలివిగా ఎంచుకున్నారు. డిసెంబర్ నాటికి సినిమా రెడీ అయ్యి, రిలీజ్ చేద్దామన్నా పోటీ ఎక్కువ ఉండటంతో సంక్రాంతి కి రిలీజ్ చేద్దామా అనుకున్నారు.
కానీ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా ఉండటంతో సంక్రాంతి సీజన్‌ను వద్దనుకున్నారు. ఇక మిగిలింది తర్వాతి నెల అయిన ఫిబ్రవరినే. అప్పటికి పెద్దగా సినిమాలు కూడా ఏమీ లేవు. దాదాపు సోలో రిలీజే ఉండొచ్చు. కాబట్టి కలెక్షన్స్ కు ఢోకా ఉండదు. డీజే టిల్లూ లానే ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని నిర్మాత చాలా ధీమాగా ఉన్నాడు. ఈ సినిమాలో డీజే టిల్లూలో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.













