టిల్లూ రిస్క్ చేస్తాడా?
రిలీజ్ ల విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో పోటీ తగ్గిందనే చెప్పాలి. అందరూ ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాలు రిలీజ్ చేసుకుని తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలతో టైర్2 హీరోలు, మీడియం రేంజ్ హీరోలు పోటీ పడటానికి అంతగా ఆకస్తి చూపించరు. థియేటర్లు ఖాళీ చూసుకుని, స్టార్ హీరోల సినిమాలు లేని టైమ్ లో రిలీజ్‌ని ప్లాన్ చేసుకుంటారు.
ఆ టైమ్ లో కూడా పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తే రిలీజ్ డేట్ మార్చుకుంటారు తప్పించి, తెగించి పోటీకి మాత్రం వెళ్లడానికి ఇష్టపడరు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ విషయంలో ఇదే జరుగుతుంది. అనుకున్న డేట్స్ కి స్టార్ హీరోలు కూడా డేట్స్ సెట్ చేసుకోవడంతో తన కొత్త సినిమా టిల్లూ స్వ్కేర్ సినిమాకు రిలీజ్ డేట్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అసలు ఫస్ట్ లో టిల్లూ స్వ్కేర్ ని ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్‌కే చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ అనడంతో సినిమాను సెప్టెంబర్ 15కి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డేట్ కి కూడా మళ్లీ పోటో నెలకొంది. రామ్- బోయపాటి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా స్కంధ ఇదే రోజున రిలీజ్ కానుంది. వారం ముందు జవాన్, వారం తర్వాత సలార్ రిలీజ్ కానుండటంతో టిల్లూ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను కూడా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. న్యూ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ వెతుకుతున్నట్లు సమాచారం. ఇంతే లేట్ చేస్తుంటే బడ్జెట్ బోలెడవుతుందని నిర్మాత నాగవంశీ రిస్క్ చేసి రిలీజ్ చేస్తారా లేక సేఫ్ గేమ్ ఆడి క్యాష్ చేసుకుంటాడో చూడాలి.













