టిల్లు స్వ్కేర్ రిలీజ్ విషయంలో తగ్గేదేలే!
టాలీవుడ్ లో కొన్ని సీజన్లను బట్టి సినిమాలు టార్గెట్ చేస్తూ ఉంటాయి. ముందుగానో ఆ డేట్ ను లాక్ చేసుకుని పెట్టుకుంటాయి సినిమాలు. ఇంకో మూడు నెలలో రాబోతున్న ఈ యేడాది ఇండిపెండెన్స్ డే కు టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా పెట్టుకుని లాక్ ఆ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి.
అందులో మొదటిది భోళా శంకర్ సినిమా. ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరూ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓ ఐటెం సాంగ్ పెట్టాలని చూస్తున్న దర్శకుడికి ఇంకా చిరూ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో దాని కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ చిరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తే శ్రియా లాంటి సీనియర్ హీరోయిన్‌తో ఆ సాంగ్ ని చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదే రోజు రజనీకాంత్ జైలర్ కూడా రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు జైలర్ ఇండిపెండెన్స్ డే బరి నుంచి తప్పుకుంది. దీంతో ఈ ప్లేస్ లోకి శివ కార్తికేయన్ మహావీరుడు వచ్చేసింది. జైలర్ దీపావళిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా- రణ్‌బీర్ కపూర్ కాంబోలో వస్తున్న యానిమల్ కూడా ఆగస్టు 11నే రిలీజ్ కాబోతుంది.
వీటితో పాటు సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్వ్కేర్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 11నే రిలీజ్ చేయాలన్న ఆలోచనతో దానికి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ. ఆ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో డీల్స్ కుదుర్చుకుని థియేటర్లు బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. చిన్న సినిమా అయినా ఈ సినిమాకు మంచి ఆఫర్లే వస్తున్నాయని తెలుస్తుంది. చూస్తుంటే ఈ ఇండిపెండెన్స్ డే మంచి రసవత్తరంగా సాగేట్లుంది.













