టిల్లూ స్క్వేర్ లో ఆ సీనే హైలైట్!
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ కెరీర్ డీజే టిల్లూ సినిమా తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో దానికి సీక్వెల్ గా టిల్లూ స్వ్కేర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దూ రెడీ అయ్యాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకుంటుంది. టిల్లూ స్క్వేర్ సినిమాలో కంటెంట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుందే విధంగా ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.
డీజే టిల్లూ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సినిమాలో కంటే ఈ సినిమాలో గ్లామర్ షో ఎక్కువగా ఉంటుందని ట్రైలర్ తోనే అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్ లేకపోవడంపై ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్ టిల్లూ స్క్వేర్ సినిమాలో రాధిక క్యారెక్టర్ ను కాసేపు పెట్టాడట. కరెక్ట్ గా కథ మలుపు తిరుగుతుందనే టైమ్ లో రాధిక పాత్రలో నేహా శెట్టి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ పది నిమిషాలు హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. రాధిక ఇచ్చే ట్విస్ట్ కు అందరూ షాక్ అవడం ఖాయమని, ఆ ట్విస్ట్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుందని చెప్తున్నారు. డీజే టిల్లూతో మంచి హిట్ అందుకున్న సిద్దూ, ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













