RC16లో బాలీవుడ్ నటుడు
శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమాను తన 15వ సినిమాగా చేస్తున్న రామ్ చరణ్, తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రంగం మొత్తం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవడంతో చరణ్ కూడా బుచ్చిబాబు కు రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం.
రీసెంట్ గా ఈ మూవీ కోసం బుచ్చిబాబు ఆఫీస్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వివవరాలేం బయటకు రాలేదు కానీ బుచ్చిబాబు ఈ సినిమా కోసం అన్ని రకాలుగా రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా విలన్‌గా విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి కానీ అధికారిక ప్రకటన లేకపోవడంతో అందులో నిజమెంతన్నది తెలియదు.
ఇప్పుడు తాజాగా చరణ్ ని ఢీ కొట్టేది విజయ్ సేతుపతి కాదని, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ అని కొత్త పేరు వినిపిస్తుంది. బుచ్చిబాబు రాసుకున్న విలన్ క్యారెక్టర్ కు టైగర్ ష్రాఫ్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి బుచ్చిబాబు ఈ డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ నిజమైతే మాత్రం సినిమాకు మంచి ఫ్రెష్ ఫీల్ రావడం ఖాయం.













