సడెన్గా ఓటీటీలోకి టైగర్ నాగేశ్వరరావు
ఓ పెద్ద సినిమా రిలీజ్ హాల్లో వస్తుంటేనే కాదు, ఓటీటీలోకి వచ్చేటప్పుడు కూడా ఓ రకమైన హడావిడి చూస్తుంటాం. కానీ టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి సౌండ్ లేకుండా నిన్న మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవడం చూసి ఫ్యాన్సే ఆశ్చర్యపోయారు. నార్మల్ గా ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయేటప్పుడు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తారు.
కానీ టైగర్ నాగేశ్వరరావు విషయంలో అలాంటిదేమీ లేకుండా డైరెక్ట్ గా సినిమాను నాలుగు వారాల గ్యాప్ తో రిలీజ్ చేయడం విశేషం. దసరా సినిమాల్లో ఓటీటీలో ముందుగా వచ్చింది ఈ సినిమానే. అనుకున్న ప్రకారం జరిగి ఉంటే నిన్ననే లియో నెట్ఫ్లిక్స్ లోకి రావాల్సింది కానీ మనసు మార్చుకుని 21కి పోస్ట్ పోన్ చేశారు. భగవంత్ కేసరి డిజిటల్ రైట్స్ కూడా ప్రైమ్ దగ్గరే ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని దాన్ని రిలీజ్ చేసే ఛాన్సుంది.
ఇలా సౌండ్ లేకుండా రవితేజ లాంటి స్టార్ సినిమా ఓటీటీలోకి రావడం ఎవరూ ఊహించినదే. అంతేకాదు ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి కట్స్ లేకుండా వస్తుందేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. రిలీజ్ అయ్యాక 2-3 రోజుల తర్వాత వచ్చిన వెర్షనే ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కాలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది.













