Sharwanand: శర్వానంద్ నుంచి వరుసగా మూడు సినిమాలు
శర్వానంద్(sharwanand)గత కొన్ని రోజులుగా నెక్ట్స్ మూవీ కోసం మేకోవర్ అవుతూ ఉన్నారు. మేకోవర్ ను పూర్తి చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అతని చేతిలో బైకర్(biker), నారీ నారీ నడుమ మురారి(nari nari naduma Murari), భోగి(bhogi) సినిమాలుండగా, వాటిలో ఆల్రెడీ బైకర్ షూటింగ్ ను పూర్తి చేసిన శర్వా, డిసెంబర్ 6న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను కూడా ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని చూస్తున్న శర్వా(sharwa), ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాడు. కాగా ఈ టాలెంటెడ్ హీరో తాజాగా సంపత్ నంది(sampath Nandi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి మూవీ కోసం డేట్స్ ను కేటాయించి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడట.
శర్వా 60 రోజుల పాటూ వర్క్ చేస్తే భోగి మూవీ పూర్తవుతుందట. ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఈ సినిమాను పూర్తి చేసి సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయాలని శర్వా అనుకుంటున్నాడట. అదే జరిగితే శర్వా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. భోగి తర్వాత శ్రీను వైట్ల(Sreenu Vaitla) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణంలో ఓ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు శర్వానంద్.






