గురూజీ కెరీర్లో మొదటి సారి ఇలా..
ఎంత పెద్ద డైరెక్టర్ కైనా సరే ఇప్పుడు పెద్ద హీరోల డేట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. వేరే భాష డైరెక్టర్లు సైతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడంతో స్థానిక డైరెక్టర్లకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. టైర్-2 హీరోలు కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకే అవకాశాలిస్తున్నారంటే ఇక స్టార్ హీరోల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దీంతో డైరెక్టర్లు పక్కా ప్లానింగ్‌తో వారి సినిమాలను ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ చాలా ముందంజలో ఉన్నారు. అందుకే కేజీఎఫ్ అయిపోకముందే నీల్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ని లైన్ లో పెట్టుకుని వారిలో ముందుగా ప్రభాస్‌తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
సందీప్ రెడ్డి వంగా చాలా కాలం మహేష్ తో సినిమా కోసం వెయిట్ చేశాడు. అది ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా లేదని తెలిసి బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన తర్వాతి సినిమా స్పిరిట్‌ను ప్రభాస్‌తో అనౌన్స్ చేశాడు. యానిమల్ రిలీజ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు.
అచ్చు ఇదే ప్లాన్ ని ఇప్పుడు త్రివిక్రమ్ కూడా పాటిస్తున్నాడు. మహేష్ తో గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్ తో అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ ఇలా ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో సినిమాను అనౌన్స్ చేయడం ఇదే మొదటి సారి. ఇకమీదట కూడా త్రివిక్రమ్ ఇలానే తన ప్లానింగ్ ను కొనసాగించే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.













