Meenakshi Chaudhary: ఈ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: మీనాక్షి
టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షికి ఇప్పుడు అవకాశాలు వెంట పడుతున్నాయి. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం అందుకుంటుంది మీనాక్షి. దీంతో అందరూ మీనాక్షిని లక్కీ హీరోయిన్ ను చేసేశారు. మహేష్(Mahesh Babu)తో గుంటూరు కారం(Guntur Karam)లో ఛాన్స్ రావడంతో అమ్మడి దిశ మారిపోయిందనుకున్నారు.
కానీ ఆ మూవీలో మీనాక్షి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తన ఫ్యాన్స్ నిరాశ చెందారు. విజయ్(VIjay) గోట్(GOAT) సినిమాలో ఛాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాలో కూడా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండదు. గోట్ సినిమాను ఓకే చేసి తొందరపడ్డాననే అభిప్రాయాన్ని మీనాక్షి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గతేడాది అమ్మడు నటించిన లక్కీ భాస్కర్(Lucky Baskhar) బ్లాక్ బ్లస్టర్ అవడంతో తనకు క్రేజ్ బాగా పెరిగింది.
రీసెంట్ గా వెంకటేష్(Venkatesh) తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత తన ఫాలోయింగ్ మరింత ఎక్కువైంది. వరుస హిట్స్ లో ఉన్న తనకు ఈ ఇయర్ ఎంతో స్పెషల్ అని, తన జీవితంలో ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మీనాక్షి వెల్లడించింది. కెరీర్ స్టార్టింగ్ లోనే పలు మంచి సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినందుకు తాను చాలా లక్కీ అని భావిస్తున్నట్టు మీనాక్షి ఈ సందర్భంగా తెలిపింది.













