అలాంటి అబ్బాయితోనే మూడు ముళ్లు : కంగనా రనౌత్
పెళ్లి గురించి తన మనసులో మాటను బయటపెట్టారు కంగనా రనౌత్. మొదట్లో పెళ్లి అంటేనే చేదు అని చెప్పిన ఆమె తాజాగా పెళ్లి చేసుకోవాలనుందనీ, తన అభిప్రాయం మారిందనీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ఆమె తాజా చిత్రం పంగా. అశ్విని అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాజీ మహిళా కబడ్డీ చాంపియన్ జయ పాత్రను కంగనా పోషిస్తున్నారు. మొదట్లో పెళ్లంటే నాకు సదభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారింది. దీనికి పంగా దర్శకురాలు అశ్వినీ అయ్యార్, ఆమె భర్త నితేశ్ తివారి ముఖ్య కారణం. వీళ్లిద్దరి మధ్యనున్న ప్రేమ, ఎమోషనల్ బాండింగ్ చూశాక వివాహంపై నాకున్న చెడు అభిప్రాయం పూర్తిగా చెరిగిపోయింది. నితేశ్ తివారి, తన భార్యకు ఇచ్చే సపోర్ట్ చూశాక నాకూ పెళ్లి చేసుకోవాలనుంది. నాకు కాబోయేవాడు అందం, తెలివితేటలు అన్నింటిలోనూ తకన్నా ఓ మెట్టు ఎక్కువే ఉండాలి. అలాంటి అబ్బాయి తోనే మూడు ముళ్లు వేయించుకుంటాను అని కంగానా సిగ్గు పడుతూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే కంగానా ఈ ఏడాది పెళ్లి పీట లెక్కే అవకాశం ఉందన్న మాట.













