‘తిప్పరామీసం’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు శ్రీ విష్ణు. నీది నాదీ ఒకే కథ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు `తిప్పరా మీసం` అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీవిష్ణు గతంలో చేసిన సినిమాల మాదిరిగానే ఇది కూడా విభిన్నంగానే ఉంది. నిక్కీ తంబోలి, రోహిణి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారా రోహిత్ హీరోగా `అసుర` చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ విజయ్ ఈ సినిమాకు డైరెక్టర్. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.













