Sobhitha Dhulipala: అందంగా లేవని అవమానించారు

రంగుల ప్రపంచంగా కనిపించే సినీ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసినా సక్సెస్ అవుతామనే గ్యారెంటీ ఉండదు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. చాలా మంది చిన్న క్యారెక్టర్లతో కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్లుగా మరుతూ ఉంటారు.
అయితే తెలుగమ్మాయి శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala) కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. కెరీర్ మొదట్లో అందంగా లేనని తనను చాలా మంది అవమానించారని, ఆ యాడ్ కు ఆడిషన్ ఇస్తే అందంగా లేనని రిజెక్ట్ చేశారని శోభిత తెలిపింది. ఓ ఫేమస్ బ్రాండ్ ఆకర్షణీయంగా లేననే రీజన్ తో తనను రిజెక్ట్ చేసిందని శోభిత వెల్లడించింది.
కట్ చేస్తే అదే బ్రాండ్ కు తాను మూడేళ్ల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశానని ఆమె తెలిపారు. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శోభిత ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే తన యాక్టింగ్ కెరీర్ ను కూడా కొనసాగిస్తుంది.