Murari vs Jalsa: రీరిలీజుల విషయంలో అర్థం లేని పోటీ
ఈ మధ్య రీరిలీజుల ట్రెండ్ బాగా ఎక్కువైపోతుంది. హిట్ సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత్తర్వాత కాస్త పేరు తెచ్చుకున్న సినిమాలను కూడా రీరిలీజ్ చేసేలా మారిపోయింది. అయితే ఈ ఇయర్ ఎండింగ్ కు పలు కొత్త సినిమాలతో పాటూ కొన్ని పాత సినిమాలు కూడా టాలీవుడ్ లో రీరిలీజవుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్(pawan kalyan) జల్సా(Jalsa), మహేష్ బాబు(Mahesh Babu) మురారి(Murari) కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలూ రీరిలీజవుతున్న నేపథ్యంలో ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం వీటిని కొత్త సినిమాల్లా భావిస్తూ దీన్నొక పెద్ద క్లాష్ లాగా భావిస్తున్నారు. కానీ వారలా ఫీలవడంలో ఏ మాత్రం అర్థం లేదని కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది. దానికి కారణమూ లేకపోలేదు. మురారి మూవీ మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే ట్రీట్ అయితే, జల్సా పవన్ ఫ్యాన్స్ తో పాటూ మహేష్ ఫ్యాన్స్ కు కూడా ట్రీటే.
ఎందుకంటే జల్సా మూవీ స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ బాబే. కాబట్టి ఈ రెండు సినిమాలూ ఒకేసారి రీరిలీజవుతున్నందుకు మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేయాల్సింది పోయి ఇలా జల్సా తమ మురారి సినిమాకు క్లాష్ అనుకోవడం అర్థం లేని తనమే అవుతుంది. మరి ఈ రీరిలీజులు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.






