VD12 రెండు భాగాలు.. కండిషన్స్ అప్లై!
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. స్టోరీ లో ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే ప్యాన్ ఇండియా సినిమాలన్నింటినీ రెండు భాగాలుగా డివైడ్ చేసి, మంచి బిజినెస్ చేసుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ను తర్వాత కేజీఎఫ్, పుష్ప సినిమాలు కంటిన్యూ చేయగా ఇప్పుడు అదే దారిలో దేవర, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా నడుస్తున్నాయి.
వీటితో పాటూ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD12 సైతం రెండు భాగాలుగా రానుందనే వార్త గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. దానికి తోడు ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెడుతున్నామని నిర్మాత చెప్పడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే VD12 గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ టెర్రిఫిక్ గా ఉంటాయని, దాంతో పాటే ఊహలకు అందని ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంటుందని, సినిమాను ప్రస్తుతానికైతే ఒక భాగంగానే తీయానుకుంటున్నట్లు, క్లైమాక్స్ లో ఓపెన్ ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు.
ఆ తర్వాత సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి రెండో భాగం తీయాలా వద్దా అనేది డిసైడ్ అయ్యేలా సినిమాను ప్లాన్ చేసుకున్నట్లు నాగవంశీ వెల్లడించాడు. రామ్ చరణ్ తో ఛాన్స్ మిస్ చేసుకున్న తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాతో తానెంటో ప్రూవ్ చేసుకోవాలనే కసితో గౌతమ్ ఉన్నాడని టాక్. ఈ సినిమాలో విజయ్ చాలా కొత్తగా కనిపించనున్నట్లు టాక్.













