హిట్ సినిమానే వారి టార్గెట్..
ఏదైనా ఓ సినిమా చేయాలంటే నిర్మాత దగ్గర నుంచి దర్శకుడు, హీరో హీరోయిన్, మిగతా కాస్ట్ అండ్ క్రూ ఇలా అందర్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందుగా స్టోరీని రెడీ చేయాలి. ఏ స్టోరీ అయితే ఆడియన్స్‌ను మెప్పిస్తుందో అన్న జడ్జిమెంట్ తెలిసుండాలి. అలా రెడీ అయిన స్టోరీని నమ్మినప్పుడే ఎవరైనా హీరో సినిమా చేస్తాడు. కానీ ఇప్పుడు స్టైల్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఎవరో రాసిన స్టోరీ మీద డిపెండ్ అవడం ఎందుకులే అని హీరోలో కథలు రాసుకుంటున్నారు.
మెయిన్‌గా యంగ్ హీరోల్లో ఈ కసి మరింత పెరిగింది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు ఎవరికి నచ్చినట్లు వారే ఎలాంటి స్టోరీ కావాలనుకుంటున్నారో వారే తమ బుర్రకి పదును పెట్టేస్తున్నారు.ఇలా తమ కథలను తామే రాసుకుంటున్న హీరోలకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వీరిలో మొదట అడవి శేష్ గురించి చెప్పాలి. మొదట్లో అతన్నెవరూ పట్టించుకోకపోయినా, ఫైనల్‌గా ఇప్పుడు ఆడియన్స్ మెప్పు పొందాడు.
తను చేసే ప్రతి సినిమా స్టోరీని తనే రెడీ చేసుకుంటాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద డబుల్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ లిస్ట్ లో సిద్దు జొన్నలగడ్డ ఉన్నాడు. అతను కూడా కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లుకు స్టోరీ అందించాడు. ఇప్పుడు చేస్తున్న టిల్లు స్వ్కేర్‌కు కూడా తనే స్టోరీ అందించాడు.
వీరితో పాటూ కిరణ్ అబ్బవరం కూడా స్క్రిప్ట్‌లో తన ఆలోచనలను షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. శ్రీ విష్ణు తన టీమ్ తో కలిసి స్టోరీ డిస్కషన్స్ చేస్తాడని టాక్. ఇలా యంగ్ హీరోలంతా కథకులుగా మారి హిట్ సినిమాలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆడియన్స్ ను మెప్పించడంతో పాటు వారి కెరీర్ గ్రోత్‌కు కూడా ఈ ఆలోచన ఎంతగానో హెల్ప్ అవుతుంది.













