తమిళ్ నాడులో ‘ఆర్ ఆర్ ఆర్’ థియేట్రీకల్ రైట్స్ దక్కించుకున్న లైకా
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న RRR మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న RRR (రౌద్రం రుధిరం రణం)పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న RRR దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ బుధవారం ఒక ప్రకటన వెలువడింది.RRR మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం RRR తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను మేం దక్కించుకున్నామని ప్రకటించడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది’’ అని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్లో పేర్కొంది.













