ఆయ్ కు థియేటర్లు పెరుగుతున్నాయ్!
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, స్త్రీ2 లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి మరీ ఆయ్ సినిమాను రిలీజ్ చేయడం అవసరమా అని అనుకోని వారు లేరు. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయ్ సినిమా దూసుకెళ్తుంది. మొన్న ఆగస్ట్ 15న రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలోకి ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకే.
కథ కొత్తది కాకపోయినా మంచి టైమ్ పాస్ చిత్రంగా ఈ సినిమా పాసైపోయింది. క్షేత్ర స్థాయిలో ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఆయ్ కు థియేటర్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ రోజు చాలా చోట్ల రెండు మూడు షో లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు క్రమంగా థియేటర్ల సంఖ్య పెరుగుతూ పోతుంది.
కంటెంట్ బలంగా ఉంటే ఎంత పోటీ అయినా సరే తట్టుకుని నిలబడొచ్చని నిర్మాత బన్నీ వాసు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ప్రస్తుతానికైతే భారీ నెంబర్స్ లేవు కానీ స్పీడ్ రికవరీనే జరుగుతుంది. ఈ సినిమాకు పోటీగా రిలీజైన సినిమాలకు వచ్చిన బ్యాడ్ టాక్ ఆయ్ కు వరంగా మారుతుంది. ఈ సినిమా విజయంలో కామెడీ, ఫాదర్ సెంటిమెంట్, మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.













