‘ఉగ్రం’ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
ఆసక్తికరమైన సీరియల్స్, వినోదం పంచే రియాలిటీ షోలతో అలరిస్తున్న జీతెలుగు ఈ ఆదివారాన్ని మరింత స్పెషల్‌గా మార్చేందుకు మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, మిర్నా జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉగ్రం’ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. అద్భుతమైన కథ, కథనంతోపాటు నరేష్ నటవిశ్వరూపంతో బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టేసిన సినిమా ఉగ్రం. మిస్టరీ థ్రిల్లర్ ఉగ్రం, ఈ ఆదివారం(సెప్టెంబర్ 17న) సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!
సిఐ శివ కుమార్ (అల్లరి నరేశ్) సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ కారు ప్రమాదం శివకుమార్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఆ ప్రమాదంలో శివ తలకు తీవ్ర గాయమవడంతో జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. మరోవైపు ఆ యాక్సిడెంట్లోనే శివ భార్య(మిర్నా), పాప కనిపించకుండా పోతారు. మరి వాళ్లను వెతికి పట్టుకునేందుకు శివ చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు సిఐ శివ కుమార్ మిస్సింగ్ కేసులను ఎలా ఛేదించాడు ? తన భార్య కూతుర్ని ఎలా కాపాడాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాల్సిందే.
దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. అల్లరి నరేష్, మిర్నా హీరోహీరోయిన్లుగా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కామెడీ స్టార్‌గా పేరుగాంచిన అల్లరి నరేష్ అదిరిపోయే యాక్షన్‌తో అదరగొట్టిన ఈ సినిమాను మీరూ మిస్సవకండి.
అల్లరి నరేష్, మిర్నా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ఉగ్రం’, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో, తప్పక చూడండి!













