Krithi Shetty: కృతికి ఎదురుచూపులు తప్పడం లేదుగా
ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి(Krithi Shetty) మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో పాటూ ఆ సినిమాతో నటిగా పేరు కూడా సంపాదించుకుంది. ఉప్పెన అందించిన క్రేజ్ వల్ల వరుస అవకాశాలను అందుకున్న కృతి వాటితో ఏ మాత్రం కెరీర్లో పైకి ఎదగలేకపోయింది. దీంతో క్రమంగా అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ లో తన లక్ ను టెస్ట్ చేసుకుందామని కృతి ట్రై చేసింది. అందులో భాగంగానే పలు సినిమాలను ఒప్పుకుని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తూ వచ్చి ఆఖరికి ఈ డిసెంబర్ లోనే రెండు సినిమాలను రిలీజ్ కు తీసుకొచ్చింది. అయితే ఎప్పుడెప్పుడు తన కోలీవుడ్ డెబ్యూ జరుగుతుందా అని ఎంతో ఎదురుచూసిన కృతికి ఎప్పటికప్పుడు అది వెనక్కి వెళ్తూనే ఉంది.
కార్తీ(Karthi) హీరోగా కృతి(Krithi) చేసిన అన్న గారు వస్తారు(Anna garu vastharu) సినిమా అనుకోకుండా సడెన్ గా వాయిదా పడగా, విఘ్నేష్ శివన్(Vignesh Sivan) దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) కూడా ఈ నెల 18 నుంచి వాయిదా పడింది. ఈ రెండు సినిమాలూ వాయిదా అయితే పడ్డాయి కానీ మళ్లీ ఎప్పుడు అవి రిలీజవుతాయనేది మాత్రం ఇంకా తెలియలేదు. మరి కృతి కోరుకుంటున్న కోలీవుడ్ డెబ్యూ ఎప్పుడు జరుగుతుందో చూడాలి.






