AKhanda2: అఖండ2 ఆలస్యానికి కారణమేంటంటే
వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో అఖండ2 తాండవం(Akhanda2 thandavam)ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా, ఇప్పుడు నాలుగో సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ కు రెడీ అవుతుందీ ద్వయం. అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే బోయపాటి అఖండ2 ను ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే అఖండ2 నుంచి రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అఖండ2కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. రిలీజ్ డేట్ కు బ్యాలెన్స్ వర్క్ పూర్తవదని, అందుకే సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి సెప్టెంబర్ నుంచి వాయిదా పడితే అఖండ2 ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.







