డైనోసర్ సీన్ ఎడిటింగ్ లో పోలేదట!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్1 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ ను చూపించకపోయినా అందులో టినూ ఆనంద్ తో చెప్పించిన డైనోసర్ డైలాగ్ ప్రభాస్ క్యారెక్టర్ కు ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చింది. ఆ డైలాగ్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సగటు మూవీ లవర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు.
సలార్ సినిమాకు వెళ్లిన ఆడియన్స్ ఆ సీన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసి, తీరా రాకపోవడంతో నిరాశ పడిపోయారు. ఇన్ని ఉండగా, ఈ సీనే ఎడిటింగ్ లో పోవాలా అని బాధపడ్డారు కూడా. అయితే ఆ సీన్ ఎడిటింగ్ లో పోలేదట. సలార్2 గా రానున్న శౌర్యాంగ పర్వంలో దేవా తండ్రిగా వచ్చే అసలు ప్రభాస్ ఎంట్రీ కోసం నీల్ దాన్ని దాచాడట.
ఇవాల వచ్చిన మూడో లిరికల్ వీడియోను గమనిస్తే ప్రభాస్ పార్ట్2 లో ఎలా ఉంటాడనేది అర్థమవుతుంది. కాకపోతే సలార్2 కోసం బాహుబలి2 లాగే చాలా టైమ్ వెయిట్ చేయక తప్పేలా లేదు. సలార్2కు సంబంధించి చాలా షూటింగ్ పెండింగ్ ఉంది. దానికి తోడు ప్రభాస్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలన్నీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా సలార్2 రావాలంటే రెండేళ్లు ఆగక తప్పదనిపిస్తుంది.













