Raja Saab: “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన..’ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్”ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “రాజా సాబ్” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని ఓ మాల్ లో ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల సందడి మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ – “రాజా సాబ్” మూవీలో సాంగ్స్ సూపర్బ్ గా వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ సహన సహన మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్ లో ప్రభాస్ గారు చేసిన సాంగ్, ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్సులు అదిరిపోతాయి. జనవరి 8న “రాజా సాబ్” ప్రీమియర్స్ లో మనమంతా కలుద్దాం. మా మూవీకి మీ సపోర్ట్ ఇలాగే అందిస్తూ ఉండండి. అన్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులైన మీ అందరికీ గుడ్ ఈవినింగ్. మీరంతా మా సినిమా మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మీ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – “రాజా సాబ్” కంటెంట్ కు మీ దగ్గర నుంచి వస్తున్న మాస్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ప్రభాస్ గారు మీ కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఫ్యాన్స్ ను అలరించేందుకు చాలా కష్టపడతారు. ఈ సంక్రాంతి రాజా సాబ్ తో రెబల్ సంక్రాంతి అవుతుంది. రెడీగా ఉండండి. అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ప్రభాస్ గారి అభిమానులకు నేనొక స్పెషల్ న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నా. “రాజా సాబ్” రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాం. అలాగే హైదరాబాద్ లోని పబ్లిక్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ప్రభాస్ గారి మూవీ రేంజ్ ను “రాజా సాబ్”తో చూడబోతున్నారు. మీరంతా కోరుకున్నట్లే జనవరి 8న ప్రీమియర్స్ లో కలుద్దాం. అన్నారు.
హీరోయిన్ రిద్ది కుమార్ మాట్లాడుతూ – పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అందరికీ థ్యాంక్స్. మీరు మా మీద, మా మూవీ మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. అందరికీ థ్యాంక్స్. అన్నారు.






