The Raja Saab: రాజా సాబ్ ఇకనైనా మొదలెట్టాల్సిందే!
బాహుబలి(Baahubali) తర్వాత ప్రభాస్(Prabhas) క్రేజ్, స్థాయి ఏ రేంజ్లో పెరిగాయో మళ్లీ స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అలాంటి స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే ఎవరికైనా అదృష్టమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయనతో వర్క్ చేసిన డైరెక్టర్లంతా ప్రభాస్ క్రేజ్ ను వాడుకుంటూనే వచ్చారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న మారుతి మాత్రం ఎందుకో ట్రిక్ ను మిస్ అవుతున్నాడనిపిస్తుంది.
ఈ మూవీ మొదలై ఇప్పటికే చాలా కాలమైనప్పటికీ రాజా సాబ్(The Raja Saab) ఎక్కడా పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. మరోవైపు ప్రభాస్- హను(Hanu Raghavapudi) కాంబోలో వస్తున్న ఫౌజీ(Fouji) గురించి, సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తో చేయనున్న స్పిరిట్(Spirit) సినిమాలు మాత్రం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. అలా అని మారుతిని తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఆడియన్స్ ను థియేటర్లకు ఎలా రప్పించాలనేది మారుతికి బాగా తెలుసు. రూరల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సినిమాపై ఉన్నట్టుండి హైప్ పెంచడంలో మారుతి మంచి దిట్ట. అలా అని మారుతి సైలైంట్ గా ఉంటే పనవదు. సినిమా ప్రమోషన్సే మెయిన్ అయిన ఈ రోజుల్లో ఎలాగైనా రాజా సాబ్ ను నిరంతరం వార్తల్లో నిలపాల్సిన బాధ్యత డైరెక్టర్ గా మారుతి పై ఉంది. ఇప్పటికైనా మారుతి రాజా సాబ్ ప్రమోషన్స్ ను మొదలుపెడితే బెటర్.













