The Raja Saab: ది రాజాసాబ్ షూటింగ్ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నప్పటికీ వాటిలో ది రాజాసాబ్(The Raja Saab) సినిమాపై అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. దానికి కారణం మారుతి(Maruthi) లాంటి డైరెక్టర్ కు ప్రభాస్ కు ఓకే చెప్పాడంటే సినిమాలో ఏదో ఉండి ఉంటుందనే ఆశ ఒకటికైతే, గతంలో ఎన్నడూ చేయని హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో ప్రభాస్ సినిమా చేస్తుండటం మరొకటి.
వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కు షూటింగ్ లో గాయమవడంతో డాక్టర్లు విశ్రాంతిని సూచించారు. ఈ నేపథ్యంలో ఇటలీకి వెళ్లిన ప్రభాస్ రీసెంట్ గానే తన ఆరోగ్యాన్ని పూర్తిగా సెట్ చేసుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చాడట. త్వరలోనే ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొననున్నాడని అంటున్నారు.
వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ది రాజాసాబ్ నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Niddhi Agerwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.






