రాజా సాబ్ ఎక్కడి వరకు వచ్చిందంటే
సలార్ తో సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం కల్కితో పాటూ మారుతీ డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ కూడా ఉంది. కల్కి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. అనుకున్న ప్రకారమైతే కల్కిని మే లో రిలీజ్ చేయాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న హారర్ కామెడీ సినిమా ను అక్టోబర్ లోపు పూర్తి చేయాలని మారుతి అనుకుంటున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40% పూర్తైనట్లు తెలుస్తోంది. రాజా సాబ్ షూటింగ్ ఎక్కువగా లోకల్ లో నిర్మించిన భారీ సెట్లలోనే షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మారుతీ అనుకుంటే సినిమాను అక్టోబర్ కంటే ముందుగానే పూర్తి చేసేయగలడు. రిలీజ్ టార్గెట్ టెన్షన్ లేకుండా రాజా సాబ్ టీమ్ షూటింగ్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.













