The Raja Saab: రాజా సాబ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
క్రేజీ లైనప్ తో ప్రభాస్(prabhas) చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the Raja Saab), హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fauji) సినిమాలను చేస్తున్న ప్రభాస్ ఆ రెండు సినిమాల షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండింటిలో ముందు రాజా సాబ్ రానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
వాస్తవానికైతే ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ పూర్తై రిలీజవాల్సింది కానీ మధ్యలో అనుకోని బ్రేకుల వల్ల సినిమా లేటవుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారని, కొన్నాళ్ల పాటూ ఈ యాక్షన్ సీక్వెన్స్ జరిగాక ఆ తర్వాత సాంగ్స్ ను తెరకెక్కించనున్నారట.
హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(malavika mohanan), నిధి అగర్వాల్(niddhi Agerwal), రిద్ధి కుమార్(riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్(thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రాజా సాబ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people Media Factory) భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ సినిమా హిట్టైతే మారుతికు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపొచ్చే అవకాశముంది.







