భారీ రేటుకు రాజా సాబ్ ఆడియో హక్కులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ది రాజా సాబ్. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ గా రాజా సాబ్ నుంచి ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయగా అందులో ప్రభాస్ లుక్స్, స్టైల్ చూసి అందరూ షాకయ్యారు.
రాజా సాబ్ లో చాలా రోజుల తర్వాత ప్రభాస్ డ్యాన్స్ చేయనున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా రాజా సాబ్ ఉండనుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారం అవుతుంది.
రాజా సాబ్ మ్యూజిక్ రైట్స్ ను భారీ ధరకు సౌత్ ఆడియో కంపెనీ ఐకాన్ మ్యూజిక్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ ఆడియో రైట్స్ కోసం ఐకాన్ మ్యూజిక్ రూ.15 కోట్లు ఖర్చు చేసిందట. గతంలో ఈగల్, డెవిల్ సినిమాల ఆడియోను సొంతం చేసుకున్న ఐకాన్ మ్యూజిక్ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమా హక్కులను కొనేసింది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఐకాన్ మ్యూజిక్ కు ఇది కచ్ఛితంగా ప్లస్ అవుతుంది. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం సూపర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడని టాక్ వినిపిస్తోంది.













