Naga Vamsi: సూర్య మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చిన నిర్మాత
కోలీవుడ్ హీరో అయినప్పటికీ సూర్య(suriya)కు తమిళంతో పాటూ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య సినిమాలు తెలుగులో కూడా బాగా పెర్పార్మ్ చేస్తుంటాయి. అలాంటి సూర్యకు గత కొన్ని సినిమాలుగా సక్సెస్ అనేది దక్కడం లేదు. ఆయన చేస్తున్న ప్రతీ సినిమా, కష్టం వృధా అయిపోతున్నాయి. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చాలా కసితో ఉన్నాడు సూర్య.
కాగా ప్రస్తుతం సూర్య, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ(Naga vamsi) నిర్మిస్తుండగా, రీసెంట్ గా నాగవంశీ ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించాడు. ఈ మూవీలో సూర్య సరసన మమిత బైజు(Mamitha Byju) హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే.
మొదట్లో సూర్య పక్కన చిన్న వయసు ఉన్న మమిత హీరోయినా అని అందరూ అనుకున్న మాటలకు నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో సూర్య తన వయసుకు తగ్గ పాత్రే చేస్తున్నాడని 40 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో ఉంటే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించనున్నామని, ఇది ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుందని, ఈ మూవీలో లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని నాగ వంశీ రివీల్ చేశాడు.






