The Paradise: ప్యారడైజ్ వాయిదా తప్పదా?

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలను చెప్పిన టైమ్ కు రిలీజ్ చేసే నాని షూటింగ్, రిలీజ్ డేట్ విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉంటాడు. అందుకే ఎప్పుడూ నాని చెప్పిన డేట్ కే సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. ఇటీవల కాలంలో నాని నుంచి వచ్చిన సినిమాలేవీ రిలీజ్ డేట్ ను మిస్ అవలేదు. అలాంటి నాని ఇప్పుడు టార్గెట్ ను మిస్ అవుతున్నాడని తెలుస్తోంది.
దసరా(Dasara) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో నాని ది ప్యారడైజ్(The Paradise) అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే లేటవుతుందని, అందుకే ఈ సినిమా ముందు చెప్పిన నెక్ట్స్ ఇయర్ మార్చిలో రావడం లేదని, సమ్మర్ తర్వాతే సినిమా రిలీజవుతుందని అంటున్నారు. స్క్రిప్ట్ లేటవడం వల్ల షూటింగ్ కూడా లేటవుతుందని సమాచారం.
రీసెంట్ షెడ్యూల్స్ కూడా టైమ్ ప్రకారం పూర్తవలేదని, తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి ఆఖరి వరకు పొగిడించారని తెలుస్తోంది. అంటే మార్చిలో ప్యారడైజ్ రావడం కష్టమే. ఎలాగూ చెప్పిన డేట్ మిస్ అయింది కాబట్టి మేకర్స్ షూటింగ్ అయ్యాకే కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేయాలని అనుకుంటున్నారట. భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తున్నాడు.