The Paradise: స్పెయిన్ లో రిలీజ్ కానున్న నాని మూవీ
ప్రస్తుతం హిట్3(Hit3), ది ప్యారడైజ్(The Paradise) సినిమాలతో బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని(Nani). శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో నాని చేస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన దసరా(Dasara) మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందించనున్నాడు.
ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లింప్స్ ను రెడీ చేసే పనిలో మేకర్స్ ఇప్పుడు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. రా స్టేట్మెంట్(Raw Statement) పేరుతో మేకర్స్ ఈ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారట. మార్చి 3న ఈ రా స్టేట్మెంట్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయముంది.
మార్చి 3న రిలీజ్ కానున్న ఈ రా స్టేట్మెంట్ ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, బెంగాలీ భాషలతో పాటూ మరో నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. స్పెయిన్ లో రిలీజ్ కానున్న మొదటి టాలీవుడ్ మూవీ ఇదే. అంతేకాదు, ఈ సినిమా కోసం నానినే స్వయంగా స్పానిష్ లో డబ్బింగ్ చెప్పనున్నాడట. దసరా మూవీ కంటే ఈ సినిమా మరింత వయొలెంట్ గా ఉంటుందని అందరూ అంటున్నారు. మరి ఈ రా స్టేట్మెంట్ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.













