The Paradise: నాని ప్యారడైజ్ మొదలయ్యేది ఎప్పుడంటే
వరుస సక్సెస్లతో మంచి ఫామ్ లో ఉన్న హీరో నాని(Nani) ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో హిట్: ది థర్డ్ కేస్(Hit: The third Case) చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో హిట్3 పై భారీ అంచనాలున్నాయి. శైలేష్ కొలను(sailesh kolanu) దర్శకత్వంలో రూపొందుతున్న హిట్3(hit3) సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
హిట్3 తర్వాత నాని తనకు దసరా(dasara) లాంటి భారీ బ్లాక్ బస్టర్ ను అందించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(the paradise) సినిమా చేయనున్నాడు. దసరా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను ది ప్యారడైజ్ రా స్టేట్మెంట్(Paradise raw statement) తో ఇంకాస్త పెంచి వాటిని తారాస్థాయికి తీసుకెళ్లాడు శ్రీకాంత్.
ఇదిలా ఉంటే ప్యారడైజ్ మూవీ గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది. మే 2వ తేదీ నుంచి ప్యారడైజ్ షూటింగ్ మొదలు కానుందని, నాని మాత్రం మే 15 నుంచి షూటింగ్ లో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. ఈ లోపు శ్రీకాంత్ మిగిలిన ఆర్టిస్టులతో సీన్స్ ను తెరకెక్కించనున్నాడని సమాచారం. ప్రస్తుతం హిట్3 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న నాని, ఆ సినిమా హడావిడి అయిపోయాక ది ప్యారడైజ్ సెట్స్ లో కాలు పెట్టనున్నాడు.













