The Paradise: ది ప్యారడైజ్ గ్లింప్స్ పై లేటెస్ట్ అప్డేట్
శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ః ది థర్డ్ కేస్(Hit: the third Case) సినిమా చేస్తున్న నాని(Nani) దాంతో పాటూ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. తనకు దసరా(Dasara) లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో నాని ఆల్రెడీ ఓ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం నాని హిట్3 తో పాటూ శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా చేస్తున్నాడు.
దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ది ప్యారడైజ్(The Paradise) అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. నాని- శ్రీకాంత్ కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో ది ప్యారడైజ్ సినిమా మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చేందుకు ది ప్యారడైజ్ నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ ను రెడీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి, దానికి సంబంధించిన వర్క్ అంతా పూర్తి చేసేశారని తెలుస్తోంది. అనిరుధ్(Anirudh) ఈ గ్లింప్స్ కు బీజీఎం ఇస్తే వెంటనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ది ప్యారడైజ్ గ్లింప్స్ ఈ నెల 20న రిలీజ్ అయ్యే ఛాన్సుంది.













