The Paradise: రూ.18 కోట్లకు ప్యారడైజ్ ఆడియో రైట్స్
ఓ వైపు హీరోగా వరుసపెట్టి హిట్లు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని(Nani), మరోవైపు నిర్మాతగా కూడా సూపర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మరింత యాక్టివ్ గా సినిమాలు తీస్తున్న నాని రీసెంట్ గా శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన హిట్3(Hit3) సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ తో మంచి కలెక్షన్లు తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది.
హిట్3 తర్వాత నాని ది ప్యారడైజ్(The Paradise) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా(Dasara) సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ది ప్యారడైజ్ సినిమా పై అనౌన్స్మెంట్ తోనే అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్యారడైజ్ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
ఇంకా చెప్పాలంటే ఆ గ్లింప్స్ చూశాక ప్యారడైజ్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో నాని ఇప్పుడో రికార్డును సృష్టించాడు. ది ప్యారడైజ్ గ్లింప్స్, దానికి వచ్చిన రెస్పాన్స్, అందులోని అనిరుధ్ మ్యూజిక్ విన్నాక సరిగమ(Saregama) ఆడియో సంస్థ ది ప్యారడైజ్ ఆడియో హక్కులను రూ. 18 కోట్ల మొత్తానికి కొనుగోలు చేసింది. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ రేట్ గా ప్యారడైజ్ రికార్డుకెక్కింది.






