సినిమా హిట్ మాత్రమే.. డబ్బులు మాత్రం రావట్లేదు..
కోవిడ్ వల్ల ఏడాది పాటూ చిత్ర పరిశ్రమ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. ఈ పరిశ్రమే ఆధారంగా బ్రతికే ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు నెలలుగా అన్నీ సర్దుకుని సాధారణ స్థితికి చేరుకోవడం మొదలైంది. థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో సినిమాలు రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. సంక్రాంతి తో మొదలుపెట్టి చాలా సినిమాలు హిట్ లిస్ట్ లో అయితే చేరాయి కానీ కమర్షియల్ గా మాత్రం డబ్బులు తిరిగి రావట్లేదని తెలుస్తుంది.
ఏడాదిగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎగ్జిబిటర్సస్ ఇప్పుడు హిట్ సినిమాలకి వచ్చిన ఓవర్ ఫ్లోస్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారట. కొందరైతే అసలు వెనక్కి కూడా ఇవ్వడం లేదట. బ్యానర్ ఏదైనా సరే సినిమా హిట్ అయితే బ్రేక్ ఈవెన్ వరకు లెక్కలు చెప్పి ఆ తర్వాత నిర్మాత గట్టిగా అడిగితే తప్ప లాభాలు వెనక్కి ఇస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవలే రిలీజ్ అయి హిట్ కొట్టిన ఒక సినిమా నిర్మాతల జేబుల్లోకి వెళ్లిన లాభాలు ఇప్పటి వరకు 2 కోట్లు మాత్రమేనట. తాజాగా సక్సెస్ కొట్టిన నిర్మాతలందరూ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదేనట.













