Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు

సినిమాపై అంచనాలు పెరగడానికి, ఆడియన్స్ ను థియేటర్ల వరకు తీసుకురావడానికి అందులోని పాటలు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఒక్కోసారి పాటల వల్లే సినిమాలు హిట్టైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే పాటల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. అయితే ఖర్చు పెట్టామని ఆ పాట సినిమాకు అడ్డుగా ఉన్నా సినిమాలో ఉంచాలనుకోవడం లేదు.
సినిమాకు ఆ పాట అడ్డుగా ఉంటే ఎంత ఖర్చు పెట్టినా సరే మొహమాటం లేకుండా దాన్ని ఎడిటింగ్ లో తీసేస్తున్నారు. ఇప్పటికే చాలా హిట్ సాంగ్స్ ను సినిమాల్లో నుంచి తీసేస్తే ఇప్పుడు తాజాగా ఆ లిస్టు లోకి మరోటి చేరింది. మొన్నా మధ్య దేవర(devara)లోని దావూది(davudi) సాంగ్ ను సినిమాలో నుంచి అలానే తీసేశారు. తర్వాత గేమ్ ఛేంజర్(game changer) లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన సాంగ్ ను లేపేశారు. రీసెంట్ గా కింగ్‌డమ్(kingdom) లో నుంచి వచ్చిన డ్యూయెట్ ను కూడా ఎడిటింగ్ లో డిలీట్ చేశారు.
ఇప్పుడదే దారిలో తేజ సజ్జా(teja sajja) హీరోగా వచ్చిన మిరాయ్(Mirai) లోని వైబ్ ఉంది సాంగ్(Vibe undhi) ను కూడా మేకర్స్ ఎడిటింగ్ లో తీసేశారు. ఆ సాంగ్ రిలీజైనప్పుడు అందులో తేజ, రితిక(ritika nayak) మధ్య కెమిస్ట్రీ, స్టెప్స్, ట్యూన్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ ను సినిమా లో లేకుండా తీసేశారు. సినిమా ఫ్లో డిస్ట్రబ్ అవుతుందని మేకర్స్ ఆ సాంగ ను తీసేశారని అర్థమవుతుంది. అయితే మూవీ చూసిన ఆడియన్స్ ఆ సాంగ్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయినప్పటికీ పాటను తీసేయడమే మంచిదైందని, ఆ సాంగ్ ను పెట్టి ఉంటే ఆడియన్స్ కు అనవసరంగా అది పంటి కింద రాయిలా మారేదని అంటున్నారు.