Sudha Kongara: మనసులోని కోరికను బయటపెట్టిన లేడీ డైరెక్టర్
ఇండస్ట్రీలో ఒకప్పటిలా కాదు, మేల్స్ మాత్రమే కాకుండా ఫీమేల్స్ లో కూడా డైరెక్టర్లు ఉన్నారు. అప్పట్లో కేవలం లేడీ డైరెక్టర్ అంటే విజయ నిర్మల(Vijaya nirmala) మాత్రమే ఉండేవారు. ఏకంగా 40కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కిన ఆమె తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కొంత కాలం పాటూ లేడీ డైరెక్టర్లు కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఆమె దారిలో ఇండస్ట్రీ బాట పడుతుండగా, వారిలో సుధా కొంగర(Sudha Kongara) కూడా ఒకరు.
సుధా ఇప్పటికే పలు సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా పరాశక్తి(Parasakthi) అనే సినిమా చేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సుధా ఈ సందర్భంగా తన మనసులోని కోరికను వెల్లడించింది.
తాను సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కు వీరాభిమానినని, ముత్తల్ మరియతై(Muthal Mariyathai) లాంటి ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీని ఆయనతో తీయాలనుకుంటున్నట్టు సుధా చెప్పుకొచ్చింది. మరి ఈ లేడీ డైరెక్టర్ కోరికను సూపర్ స్టార్ విని ఆమెకు అవకాశమిస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకు డిఫరెంట్ సినిమాలను తీసిన సుధా, సూపర్ స్టార్ తో ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.






