ది ఐరన్ లేడీలో జయలలిత లుక్
మల్టీ టాలెంటెడ్ నిత్యామీనన్ ప్రస్తుతం బయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది ఐరన్ లేడీ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న బయోపిక్‌కి తెరవెనక రంగం ఎప్పుడో సిద్ధమైంది. నిత్యమీనన్ ఫస్ట్‌లుక్ ఇదివరకే రిలీజ్ చేశారు. తాజాగా స్కెచ్ చేసినట్లుగా మరో లుక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. జయలలిత బయోపిక్ అంటే ముఖ్యంగా రెండు వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుంది. ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడూ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. సినిమాల్లో ఉన్నప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసేమో కానీ రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అమ్మ అని తమిళ ప్రజలు అమెను అభిమానంగా పిలుచుకునేవారు. ఆ అమ్మ పాత్ర లుక్‌లో నిత్యామీనన్ కనిపిస్తోంది. ఈ లుక్‌తో నిత్యా అచ్చం జయలలితను తలపిస్తోంది. ఇది ఒరిజినల్ లుకేనా? లేదా ఊహా చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది.













