Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు

ఇండియన్ మూవీ హిస్టరీలో తుంబా(tumbbad)డ్ సినిమాకు ఓ స్పెషల్ రికార్డుంది. హార్రర్ ఫాంటసీ జానర్ లో వచ్చిన ఈ మూవీ జానపద, మైథాలజీ, హార్రర్, ఫాంటసీ అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కగా, తుంబాడ్ కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాకుండా విమర్శకులను కూడా మెప్పించింది. 2018లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచనప్పటికీ గతేడాది రీరిలీజ్ చేసినప్పుడు మాత్రం రికార్డు రేంజ్ కలెక్షన్లు వచ్చాయి.
తుంబాడ్ రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఆ సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేయగా, ఇప్పుడు ఆ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్ కోసం హీరో, నిర్మాత సోహుమ్ షా(sohum shah), పెన్ స్టూడియోస్(pen studios) అధినేత జయంతిలాల్ గడా(jayanthilal gada)తో చేతులు కలిపారని తెలుస్తోంది. పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తుంబాడ్2 స్థాయి మరింత పెరిగింది.
అయితే ఈ సందర్భంగా సోహుమ్ షా మాట్లాడుతూ, తాను చాలా ఏళ్లుగా జయంతిలాల్ గడా పనితనాన్ని చూస్తున్నానని, తుంబాడ్2 సినిమా గురించి చర్చించడానికి వెళ్లినప్పుడు ఆయన కేవలం 5 నిమిషాల్లోనే ఈ డీల్ ను క్లోజ్ చేశారని, తుంబాడ్ సినిమాను ఆయన చాలా పొగిడారని, సినిమాపై ఆయన చాలా గౌరవం మరియు ప్రేమను చూపారని చెప్పారు. కాగా ఈ సినిమాకు తుంబాడ్ కు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.