Nara Rohith: ఒకప్పుడున్న కంఫర్ట్ ఇప్పుడు లేదు
రీసెంట్ గా భైరవం(Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్(nara rohith) ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సుందరకాండ(sundarakanda) అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్న నారా రోహిత్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. వినాయక చవితి సందర్భంగా సుందరకాండ సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది.
వెంటేష్ నిమ్మలపూడి(venkatesh nimmalapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెప్తున్నారు నారా రోహిత్. సినిమా చూసినంతసేపు ఆడియన్స్ ముఖంపై చిరునవ్వు అలానే ఉంటుందని చెప్పిన నారా రోహిత్ మూవీ చూసేటప్పుడు ఆడియన్స్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారో కథ వినేటప్పుడు తాను కూడా అలానే ఉంటానని, స్క్రిప్ట్ కొత్తగా ఉందనిపిస్తే ఆ సినిమా చేస్తానని అన్నాడు.
ఎవరైనా మంచి విలన్ క్యారెక్టర్ ను రాసి తీసుకొస్తే విలన్ గా చేయడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పిన రోహిత్, ఒకప్పటిలా ఇప్పుడు ఇండస్ట్రీ లేదన్నారు. అప్పట్లో ఒక హిట్ వస్తే నాలుగైదు సినిమాల వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేదని కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని, ఏ హీరోకీ ఇప్పుడు కంఫర్ట్ జోన్ లేదని చెప్పుకొచ్చాడు నారా రోహిత్.







