Komali Prasad: ఇండస్ట్రీలోకి రావడం అందుకే లేటైంది
టాలీవుడ్ లో ఎంతో మంది డాక్టర్లున్నారు. వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. సాయి పల్లవి(Sai pallavi), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రీలీల(Sree Leela), కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskara) డాక్టర్లు అనే విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొకరు తోడయ్యారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్న కోమలి ప్రసాదే(Komali Prasad) ఆ డాక్టర్.
ఇటీవల నాని(Nani) హీరోగా వచ్చిన హిట్3(Hit3) సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన కోమలి ప్రసాద్ అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన హిట్2 లో కూడా నటించింది. హిట్3 సినిమా తర్వాత కోమలికి పాపులారిటీ పెరిగింది. హిట్3 ప్రమోషన్స్ లో భాగంగా కోమలి ఇంటర్వ్యూల్లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
కోమలి ప్రసాద్ రియల్ లైఫ్ లో డాక్టర్ అట. డాక్టర్ చదివాక డెంటిస్ట్ గా వర్క్ చేశానని, ముందే సినిమాల్లోకి వెళ్తానంటే తన తండ్రి ఒప్పుకోలేదట. డాక్టర్ సర్టిఫికేట్ చేతికొచ్చాక ఏదైనా చేసుకోమన్నారని, అందుకే ఇండస్ట్రీలోకి రావడానికి లేట్ అయిందని చెప్పిన కోమలి, న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చేద్దామనుకునే టైమ్ లో నేను సీతా దేవి(Neni Sitha Devi) మూవీ ఆఫర్ వచ్చిందని, సినిమాలో నటిస్తావా అనగానే మాస్టర్స్ అప్లికేషన్ ను చింపేసి ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.






