Ravi Babu: ఆడియన్స్ కు ఆ అతే కావాలి
టాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్, ఇక్కడ జరిగే హంగామా, ఫ్యాన్స్, ఫ్యాన్ వార్స్ మరే ఇండస్ట్రీలోనూ జరగవు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి అయితే చెప్పే పనే లేదు. ఎంతో హడావుడిగా ఎంతో హంగామా చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు ఫ్యాన్స్ వచ్చి కాళ్ల మీద పడటం లాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.
తాజాగా ఈ విషయాలతో పాటూ టాలీవుడ్ లోని యాక్టర్ల నటీనటుల గురించి నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న రవిబాబు(ravibabu) మాట్లాడారు. టాలీవుడ్ యాక్టర్ నటన గురించి, ఇండస్ట్రీలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో సీన్ కు సంబంధం లేకుండా ఓవరాక్షన్ చేస్తే మెచ్చుకుంటారన్నారు.
తానెన్నో సినిమాల్లో నటించానని, మురారి మూవీలో ఓవరాక్షన్ చేస్తూ పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని, కానీ మురారి(murari) మూవీలోపిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని, కానీ ఆ మూవీలో యాక్టింగ్ చూశాక అందరూ టాలీవుడ్ కు భలే యాక్టర్ దొరికాడురా అని పొగిడారని, అతి చేస్తేనే తెలుగు ఆడియన్స్ బెస్ట్ గా గుర్తిస్తున్నారని కామెంట్స్ చేశారు. అదే ఇంటర్వ్యూలో ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి మాట్లాడుతూ, ఆ ఈవెంట్స్ లో ఒకరి గురించి మరొకరు ఎందుకు ఎలివేషన్లు ఇస్తారో కూడా తెలియదని, అవన్నీ అసహనానికి గురి చేస్తాయని చెప్పగా, రవిబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






