దేవరలో ఆ సీన్ హైలైట్ అట
2024లో రానున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రానుండటంతో దేవరపై అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. గతంలో ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్ అవడంతో దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వీరి కాంబోలో వస్తున్న దేవర సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తోంది.
దేవరలో ఎన్టీఆర్ గంగమ్మ తల్లి భక్తుడిగా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం గంగమ్మ జాతరకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. గంగమ్మ జాతరలో భాగంగా ఓ భారీ ఫైట్ సీన్ ను కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమా మొత్తంలో ఈ సీన్ హైలెట్ కానుందని చిత్ర యూనిట్ చెప్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ కు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













