మహాలక్ష్మి ఇంటికి పెళ్లి కళ వచ్చేసిందోచ్
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దటీజ్ మహాలక్ష్మి. హిందీలో కంగనారనౌత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం క్వీన్ రీమేక్‌గా తెరెకెక్కుతోంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పుల్ బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ చిత్రం వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల కానుంది. మహాలక్ష్మి ఇంటికి పెళ్లి కళ వచ్చేసిందోచ్.. రేపే సన్నాయి మొదలు వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియో రేపటి నుంచి అని యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.













