దటీజ్ మహాలక్ష్మి పై మిల్కీబ్యూటీ ఆశలు
మిల్కీబ్యూటీ తమన్నా తెలుగులో దాదాపు యంగ్‌స్టార్ హీరోలందరితో నటించింది. స్టార్స్టేటస్ను దక్కిచుకుంది. ఇలాంటి సమయంలో నెక్ట్స్ ఏంటి లో చేసింది. ఇక ప్రస్తుతం ఆశలన్నీ కూడా దటీజ్ మహాలక్ష్మి చిత్రంపైనే తమన్నా పెట్టుకుందట. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్‌కు రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన ఈ మూవీ అవార్డులను కూడా అందుకుంది. క్వీన్ చిత్రంతో కంగనా రనౌత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇపుడు ఆ పాత్రను తెలుగులో తమన్నా చేయటంతో అందరూ కూడా తమన్నా నుంచి ఆ స్థాయిలో నటన ఆశిస్తున్నారు.













