Deepika Padukone: ఆ సినిమాతోనే టాలీవుడ్ డెబ్యూ జరగాల్సిందట

గత కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రెమ్యూనరేషన్, వర్కింగ్ అవర్స్ కారణంగా స్పిరిట్(Spirit) సినిమాను వదులుకున్న దీపికా ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ లో రాణించింనే సంగతి తెలిసిందే. దాని కంటే ముందు దీపికా తండ్రి ప్రకాష్ పదుకొణె(Prakash Padukone) ప్రభావంతో స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కూడా పాల్గొంది. కానీ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది దీపికా.
దీపికా సినీ కెరీర్ ఐశ్వర్య(Aishwarya) అనే కన్నడ మూవీతో మొదలైంది. కానీ దీపికా తెలుగులో డెబ్యూ చేసింది మాత్రం గతేడాది వచ్చి కల్కి(Kalki) సినిమాతనే. వాస్తవానికి దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో అయిపోవాల్సిందట. గతంలో జయంత్ సి. పరాన్జీ(Jayanth C Parajee) దర్శకత్వంలో తెరకెక్కిన ఓ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో దీపికా పదుకొణె ఓ స్పెషల్ సాంగ్ చేసిందట. షూటింగ్ మొదలైనప్పటికీ ఆ సినిమా ఇప్పటికీ రిలీజవలేదు.
ఆ సినిమా రిలీజవకపోవడంతో గతేడాది కల్కితో దీపికా డెబ్యూ జరిగింది. ఇక ఇప్పుడు దీపికా చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి కల్కి2(Kalki2) కాగా మరోటి అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా. ఈ రెండు సినిమాల్లోనూ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. పాప పుట్టిన తర్వాత పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్తున్న దీపికా తన దగ్గరున్న సీక్రెట్స్ ను ఏ హీరోతో షేర్ చేసుకుంటారని అడిగితే వెంటనే షారుఖ్ ఖాన్(Shah rukh Khan) పేరు చెప్పింది. వీరిద్దరూ కలిసి గతంలో ఓం శాంతి ఓం(Om Shanthi Om), చెన్నై ఎక్స్‌ప్రెస్(Chennai Express), హ్యాపీ న్యూ ఇయర్(Happy New Year), జవాన్(jawaan) లాంటి హిట్ సినిమాల్లో నటించారు.