Tharun Bhascker: తరుణ్ పోస్ట్.. ఆ సీక్వెల్ గురించేనా?
విశ్వక్సేన్(Viswaksen) హీరోగా తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో వచ్చిన మూవీ ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindhi). సింపుల్ స్టోరీతో యువతను ఆకట్టుకునేలా తరుణ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి మొదట్లో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవలేదు కానీ తర్వాత మీమ్స్ వల్ల ఈ మూవీ బాగా ఫేమస్ అయింది.
సోషల్ మీడియా ద్వారా బాగా పాపులరైన ఈ మూవీకి సీక్వెల్ చేయమని అభిమానులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా సీక్వెల్ చేస్తా అంటున్నాడు కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పడం లేదు. అయితే ఆ మూవీకి సంబంధించిన క్రేజ్, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని తరుణ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది మూవీకి సీక్వెల్ చేయబోతున్నట్టు ఓ హింట్ ఇస్తూ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. ఈ ఇయర్ కొన్ని బాకీలను తీర్చాలని తరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అందరూ ఆ పోస్ట్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించేనని అనుకుంటూ తరుణ్ చేసిన పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.













