రిలీజ్ డేట్ విషయంలో తండేల్ టీమ్ ఆలోచన తప్పా?
నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్(thandel). ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్య్సకారుల జీవితంలో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్2(geetha arts2) బ్యానర్ పై బన్నీ వాసు(bunny Vas) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారు. ఈ సినిమా కోసం చైతూ ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. తండేల్ పై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. ముందు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి సెన్సార్ పూర్తయ్యే ఛాన్స్ లేదని సంక్రాంతికి తండేల్ రిలీజ్ కానుందని నెట్టింట ప్రచారం జరిగింది.
తండేల్ సంక్రాంతికి రిలీజ్ కానుందనే వార్తలు విని ఫ్యాన్స్ అంతా సంతోషపడ్డారు. తండేల్ లాంటి బజ్ ఉన్న సినిమాలకు సంక్రాంతికి మించిన సీజన్ ఉండదు. కానీ మేకర్స్ నుంచి మాత్రం తండేల్ రిలీజ్ డేట్ లో ఎలాంటి క్లారిటీ లేదు. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు నెట్టింట మరో వార్త వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ ను తండేల్ నిర్మాతలు పక్కన పెట్టి రిపబ్లిక్ డే లేదా వాలెంటైన్స్ డేకు సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ తండేల్ టీమ్ తప్పుగా ఆలోచిస్తుందని, సినిమా సంక్రాంతికే రావాలని అభిప్రాయపడుతున్నారు. మరి తండేల్ టీమ్ రిలీజ్ డేట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.













