డైలమాలో తండేల్ టీమ్
ప్రకృతిలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ ని డిసైడ్ చేస్తుందని డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాగచైతన్య తండేల్ పరిస్థితి అలానే ఉంది. ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో గీతా ఆర్ట్స్2 చెప్పిన డేట్ కు కట్టబడలేని ఇరకాటంలో పడింది.
పుష్ప2 చెప్పిన ప్రకారం డిసెంబర్ 6న వస్తే మిగిలిన సినిమాలకు స్కోప్ ఉండదు. పుష్ప2 తర్వాత రెండు వారాల గ్యాప్ తో చరణ్ గేమ్ ఛేంజర్ తో పలకరిస్తాడు. ఈ రెండు సినిమాల మధ్య సినిమాను రిలీజ్ చేసి నష్టపోవాలని ఎవరూ అనుకోరు. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చెప్పిన డేట్స్ కు వస్తే తండేల్ కు రెండే ఆప్షన్లున్నాయి.
ఒకటి రిలీజ్ డేట్ ను ప్రీ పోన్ చేసి నవంబర్ కు మార్చుకోవాలి. తండేల్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఆ సీజన్ సేఫ్ కాదు. అక్టోబర్ షెడ్యూల్ ఆల్రెడీ టైట్ గా ఉంది. అదికాదని సంక్రాంతికి రిలీజ్ చేద్దామా అంటే చిరంజీవి విశ్వంభర ఇప్పటికే షెడ్యూల్ అయి ఉంది. చిరూ సినిమాకు పోటీగా తండేల్ ను రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ అనుకోడు. విశ్వంభరతో పాటూ పలు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ పై కన్నేశాయి. మరి ఇంత సందిగ్ధంలో తండేల్ చివరకు ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందో చూడాలి.













